హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి , పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సగం పూర్తయిన కరీంనగర్, సిరిసిల్ల, కొత్తగూడెం, కిన్నెరసాని, అలంపూర్, ట్రైబల్ సర్క్యూట్ ఆరు హరిత హోటల్ ప్రాజెక్టులను పబ్లిక్ -ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో పూర్తి చేసి, నిర్వహించేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) టెండర్లకు నోటిఫికేషన్ ఇచ్చింది.
