ఆ మందులు కొంటే మెడిక‌ల్ షాపులో వివ‌రాలు

ఆ మందులు కొంటే మెడిక‌ల్ షాపులో వివ‌రాలు

మెడికల్ షాపులను ఫీవర్ సర్వేలేన్స్ లో భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జ్వరం, గొంతు నొప్పి నివారణకు మెడికల్ షాపుల నుండి మందులు కొనుగోలు చేసే వాళ్ళ వివరాలు సేకరించాలని మెడిక‌ల్ షాపు య‌జ‌మానుల‌ను ఆదేశించింది. డ్రగ్ ఇన్ స్పెక్టర్ల సహకారంతో ఆయా మున్సిపాలిటీల ఫార్మసి అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వ‌హించింది. జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను మెడికల్ షాపులు ప్రభుత్వానికి తప్పనిసరిగా అందజేయాలని నిర్ణ‌యం తీసుకుంది.