ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడి వైపు..

ఎడమవైపు ఉండాల్సిన గుండె కుడి వైపు..

తూప్రాన్, వెలుగు: సిద్దిపేట జిల్లా తూప్రాన్ లో కుడివైపు గుండెతో ఓ శిశువు జన్మించింది. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి ఆబోతుపల్లికి చెందిన పెంటయ్య, రమ్య దంపతులకు రెండో సంతానంగా పాప పుట్టింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయగా ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడి వైపు ఉందని తేలింది. ఈ సందర్భంగా సుష్మ హాస్పిటల్ డాక్టర్ ప్రదీప్ సింహ మాట్లాడుతూ లక్ష మందిలో ఒకరికి ఇలా ఉంటుందన్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు.