క్రికెట్ బ్యాట్‌‌కు వేలంలో భారీ ధర

క్రికెట్ బ్యాట్‌‌కు వేలంలో భారీ ధర

న్యూఢిల్లీ:  మహేంద్ర సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధోనీ కెప్టెన్సీలో 2011 వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు సంతకం చేసిన బ్యాట్‌‌‌‌‌‌‌‌ వేలంలో ఏకంగా రూ.18.84 లక్షలు పలికింది.  2016 ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ నెగ్గిన వార్నర్‌‌‌‌‌‌‌‌ సంతకం చేసిన అతని సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌  జెర్సీ రూ. 22.61 లక్షలకు అమ్ముడైంది.  దుబాయ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీ ఆక్షన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా శుక్రవారం నిర్వహించిన వేలంలో సోర్ట్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన చారిత్రాత్మక వస్తువులు, డిజిటల్‌‌‌‌‌‌‌‌ రైట్స్‌‌‌‌‌‌‌‌కు భారీ డిమాండ్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఇందులో వార్నర్‌‌‌‌‌‌‌‌ జెర్సీ ఎక్కువ రేటు పలకగా.. 28 ఏళ్ల విరామం తర్వాత రెండో వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ అందుకున్న ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ సైన్‌‌‌‌‌‌‌‌ చేసిన బ్యాటు కోసం కూడా బిడ్డర్లు ఎగబడ్డారు.  ఇక, సచిన్‌‌‌‌‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ 200వ టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన డిజిటల్‌‌‌‌‌‌‌‌ రైట్స్‌‌‌‌‌‌‌‌ కలెక్షన్‌‌‌‌‌‌‌‌కు ముంబైకి చెందిన అతని ఫ్యాన్‌‌‌‌‌‌‌‌ అమల్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ రూ. 30 లక్షలకు కొనుక్కున్నాడు. మొదటగా ఆక్షన్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఈ కలెక్షన్‌‌‌‌‌‌‌‌లో సచిన్‌‌‌‌‌‌‌‌ సంతకాలు చేసిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జెర్సీ, టికెట్‌‌‌‌‌‌‌‌, ప్రత్యేక స్మారక కవర్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. ఆసీస్‌‌‌‌‌‌‌‌ లెజెండ్‌‌‌‌‌‌‌‌ డాన్‌‌‌‌‌‌‌‌ బ్రాడ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ సంతకం చేసిన స్టాంప్‌‌‌‌‌‌‌‌ రూ. 19.95 లక్షలకు అమ్ముడైంది. ఇండియా వెటరన్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ జులన్‌‌‌‌‌‌‌‌ గోస్వామి 2017 వరల్డ్‌‌‌‌‌‌‌‌ సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌ జెర్సీకి ఏడున్నర లక్షలు వచ్చాయి. ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీలో ఓ విమెన్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన వస్తువును వేలం వేయడం ఇదే తొలిసారి. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా క్రికెట్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన  పాత వస్తువులు,  హిస్టారిక్‌‌‌‌‌‌‌‌ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌ డిజిటిల్‌‌‌‌‌‌‌‌ కలెక్షన్స్‌‌‌‌‌‌‌‌ రెండున్నర కోట్లకు పైనే పలికాయి.