మాదాపూర్ కలుషిత నీటి ఘటనలో పెరుగుతున్న బాధితులు

మాదాపూర్ కలుషిత నీటి ఘటనలో పెరుగుతున్న బాధితులు

మాదాపూర్ గుట్టల బేగంపేట్  కలుషిత నీటి  ఘటనలో అనారోగ్యానికి గురైన వారి  సంఖ్య పెరుగుతోంది.  కొండాపూర్  ఏరియా హాస్పిటల్ లో బాధితుల  సంఖ్య  27కు చేరింది. కలుషిత నీరు  తాగడంతో వాంతులు... విరేచనాలతో ...నిన్న 18 మంది  కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో  చేరారు. అయితే  ఈరోజు మరో  9 మంది  హాస్పిటల్ పాలయ్యారు.  దీంతో బాధితుల  సంఖ్య  27కు చేరింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న  27 మందిలో  13 మంది చిన్నారులు కాగా  ముగ్గురు  వృద్ధులు ఉన్నారు.  మరోక  గర్భణీ కూడా  అనారోగ్యంతో చికిత్స  పొందుతోంది. వృద్ధులకు  ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.  ఎవరికి ఎలాంటి  ప్రాణ హానీ  లేదని డాక్టర్లు తెలిపారు. మరోవైపు  కలుషిత నీటిపై  స్థానికులు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు చేస్తున్నా  అధికారులు పట్టించుకోలేదని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాదాపూర్ లోని గుట్టల బేగంపేట్​లో  నాలుగు రోజులుగా నీళ్లు మురికిగా రావడంతో అస్వస్థతకు గురై  భీమయ్య అనే వ్యక్తి చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  కలుషిత నీళ్లపై  ముందుగానే అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ నీళ్లు కలుషితం కావడంలేదని వాటర్​బోర్డు అధికారులు అంటున్నారు. 

అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు

కోహ్లీ, కుంబ్లే గొడవపై నోరు విప్పిన వినోద్ రాయ్