స్మార్ట్​ఫోన్​ యూజర్లు 100 కోట్లు

స్మార్ట్​ఫోన్​ యూజర్లు 100 కోట్లు

న్యూఢిల్లీ: 2026 నాటికి దేశంలోని స్మార్ట్​ఫోన్ల యూజర్లు 100 కోట్లకు చేరతారని డెలాయిట్​ స్టడీ వెల్లడించింది. 2021 నాటికి దేశంలో 120 కోట్ల మొబైల్​ సబ్​స్క్రయిబర్లుండగా, అందులో 75 కోట్ల మంది స్మార్ట్​ ఫోన్లనే వాడుతున్నారు. రాబోయే అయిదేళ్లలో స్మార్ట్​ఫోన్​ మాన్యుఫాక్చరింగ్​లో  గ్లోబల్​గా రెండో పెద్ద దేశంగా ఇండియా మారనుందని స్టడీ పేర్కొంది. రూరల్​ ఏరియాలలో స్మార్ట్​ఫోన్ల వాడకం భారీగా పెరుగుతోందని, ఏటా ఇది 6 శాతం దాకా ఉండొచ్చని డెలాయిట్​ అంచనా వేస్తోంది. ఇంటర్​నెట్​ వినియోగం పెరగడమే స్మార్ట్​ ఫోన్ల సంఖ్య అధికమవడానికి కారణమని ఈ స్టడీ వివరించింది. 2026 నాటికి   అర్బన్​ ఏరియాలలో కొత్త ఫోన్లు కొనాలనుకునే  ప్రతీ వంద మందిలో 95 మంది కొత్త స్మార్ట్​ఫోన్​నే కొంటారని తెలిపింది. రూరల్​ ఏరియాలలోనైతే ప్రతీ వంద మందిలో 80 మంది కొత్త స్మార్ట్​ ఫోన్​నే కొంటారని పేర్కొంది.  2021 నాటికి దేశంలో  స్మార్ట్​ఫోన్ల డిమాండ్​ ఏడాదికి 30 కోట్లని, ఇది 2026 నాటికి 40 కోట్లకు పెరుగుతుందని డెలాయిట్​ స్టడీ వెల్లడించింది. హైస్పీడ్​ గేమింగ్​, రిమోట్​ హెల్త్​కేర్​ వంటి అప్లికేషన్ల వల్ల 5జీ గ్రోత్​వేగంగా ఉంటుందని కూడా అంచనా వేసింది.