మావోల ఏరివేత కోసం సరికొత్త వ్యూహం

మావోల ఏరివేత కోసం సరికొత్త వ్యూహం

మావోల ఏరివేత కోసం సరికొత్త వ్యూహం పన్నారు చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ పోలీసులు. వర్షాకాలంలో మావోల యాక్టివిటీల కట్టడి కోసం మహిళ కమాండోలను రంగంలోకి దించనున్నారు. రెయిన్ సీజన్ లో వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో కూంబింగ్ లకు, స్పెషల్ ఆపరేషన్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ్ నేతృత్వంలో DRG అండ్ దంతేశ్వరి మహిళా కమాండోలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరిని మొదటగా..ఈ నెల 28 నుంచి జరిగే మావోయిస్టుల వారోత్సవాల కట్టడికి ఉపయోగించనున్నారు. ఈ ఆపరేషన్ లలో ఎవరూ పైచేయి సాధిస్తారో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని వార్తల కోసం..

నేను ముత్యాల ముగ్గు హీరోయిన్.. రేవంత్ రెడ్డి విలన్

భారత్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ బాధితురాలి పరిస్థితి విషమం