ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్ పేట అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి తలసాని 11 టేబుల్ లు, రెండు బీరువాలు స్వంత ఖర్చులతో అందించి దాతృత్వం చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను స్ఫూర్తి గా తీసుకొని ఎస్.ఆర్.నగర్ సి ఐ సైదులు చొరవతో మరి కొంతమంది దాతలు కూడా ఆసుపత్రికి కావలసిన వస్తువులను అందించారు. కాగా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా హాస్పిటల్ ను 100 పడకలకు పెంచేందుకు కృషి చేస్తానని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
అమీర్ పేట లోని 50 పడకల హాస్పిటల్ కు దాతల సహకారంతో ఫ్రిజ్ లు, AC లు, ఫర్నిచర్ ను అందచేయడం జరిగింది. pic.twitter.com/FIRkIMxdhU
— Talasani Srinivas Yadav (@YadavTalasani) August 24, 2022
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో అభివృద్ధి చెందాయన్న మంత్రి తలసాని... కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వేలాది రూపాయల విలువైన వైద్య పరీక్షలు ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా నిర్వహిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇకపోతే మంత్రి తలసానిని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు దాతలు ఫ్రిజ్ లు, ACలు, ఫర్నిచర్ ను ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా పేద ప్రజల కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన దాతలను తలసాని అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శేషుకుమారితో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు..

