సూరీడు.. నిప్పులు కక్కిండు

సూరీడు.. నిప్పులు కక్కిండు


    రేడియో, జీపీఎస్​, శాటిలైట్​ కమ్యూనికేషన్లకు అంతరాయం
    ఇండియా, సౌత్​ ఈస్ట్​, ఆసియా మీద ఎఫెక్ట్​
న్యూఢిల్లీ: సూరీడు నిప్పులు కక్కిండు.. అలాంటి ఇలాంటి నిప్పులు కావవి. శాటిలైట్​ కమ్యూనికేషన్స్​ను, గ్లోబల్​ పొజిషనింగ్​ సిస్టమ్​ (జీపీఎస్​)కు తీవ్రమైన ఆటంకం కలిగించే నిప్పులవి. బుధవారం ఉదయం 9.27 గంటలకు ఎక్స్​2.2 క్లాస్​కు చెందిన అగ్ని వలయాన్ని సూర్యుడు చిందించాడని సెంటర్​  ఆఫ్​ ఎక్సలెన్స్​ ఇన్​ స్పేస్​ సైన్సెస్​ ఇండియాసెసీ) సైంటిస్టులు వెల్లడించారు. ఈ అగ్ని వలయం సూర్యుడిపై ఉండే ఏఆర్​12992 అనే ప్రాంతం నుంచి వెలువడ్డాయని సెసీ అసోసియేట్​ ప్రొఫెసర్​, కోఆర్డినేటర్​ దిబ్యేందు నంది చెప్పారు. ప్రస్తుతం ఇండియా, సౌత్​ ఈస్ట్​ ఆసియా, ఆసియా పసిఫిక్​ రీజియన్​ మీద దీని ప్రభావం ఉందని పేర్కొన్నారు. సోలార్​ ఫ్లేర్స్​లో ఎక్స్​క్లాస్ అత్యంత శక్తిమంతమైనదన్నారు. దీనివల్ల కమ్యూనికేషన్స్​లో అంతరాయం ఏర్పడుతుందని, శాటిలైట్, జీపీఎస్​ల పనితీరులో లోపాలొస్తాయని పేర్కొన్నారు. ఒక్కోసారి స్పేస్​క్రాఫ్ట్​లపైనా ప్రభావం ఉంటుందని, వచ్చిపోయే ఆస్ట్రోనాట్లకు ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పారు. వాటితో పాటు రేడియో సిగ్నల్స్​, పవర్​ గ్రిడ్స్​, నావిగేషన్​ సిగ్నల్స్​ మీదా ఎఫెక్ట్​ ఉండే అవకాశం ఉందన్నారు.