కివీస్ తోనే సూపర్ ఓవర్ మొదలైంది

కివీస్ తోనే సూపర్ ఓవర్ మొదలైంది

క్రికెట్ కు థ్రిల్లింగ్ తెచ్చిన సూపర్ ఓవర్ మొదటిసారిగా జరిగింది న్యూజిలాండ్ తోనే. 2008లో టీ20 మ్యాచుల్లో మొదటిగా సూపర్ ఓవర్ మొదలైంది. అంతకుముందు ఉన్న బాల్ ఔట్ స్థానంలో సూపర్ ఓవర్ ను ICC తీసుకువచ్చింది. మొదటి సూపర్ ఓవర్ 2008 డిసెంబర్ 8న న్యూజిలాండ్-వెస్టిండీస్ టీమ్స్ మధ్య జరింగింది. ఈ ఓవర్ లో విండీస్ 25 రన్స్ చేయగా..కివీస్ 15 రన్స్ మాత్రమే చేసి ఓటమి పాలైంది.

ఇప్పటివరకు టీ20ల్లో మొత్తం 13 సూపర్ ఓవర్లు జరిగాయి. వన్డేల్లో మాత్రం 2019 వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రమే సూపర్ ఓవర్ జరిగింది. అయితే సూపర్ ఓవర్ ఫోబియా నుంచి న్యూజిలాండ్ బయటపడలేకపోతుంది. సూపర్ ఓవర్ ఫస్ట్ లోనూ ఓడిన న్యూజిలాండ్ ..ఇప్పుడు భారత్ తో వరుసగా 2 సూపర్ ఓవర్లలో ఓడటంతో ..సూపర్ ఓవర్ తమకు కలిసిరావడంలేదంటూ కివీస్ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.

 కివీస్ కు చుక్కలు చూపించిన భారత్