ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదహారేళ్లు గడిచినా కాజల్ స్పీడు మాత్రం ఇంతవరకు తగ్గలేదు. ఇప్పటికే చేతి నిండా సినిమాలున్నాయి. ఇప్పుడు మరో సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. కాజల్ లీడ్ రోల్లో రాజు శరవణన్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘రౌడీ బేబీ’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారని టాక్. తల్లీకూతుళ్ల సెంటిమెంట్‌తో రూపొందే ఈ మూవీలో కాజల్ పాత్ర డీగ్లామరస్‌గా ఉంటుందట. ఆమెకి ఓ చిన్న కూతురు కూడా ఉంటుందట. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలే సినిమాకి హైలైట్ అట. రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. మరికొద్ది రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. రీసెంట్గా ‘ఘోస్టీ’ సినిమా షూట్‌ని కంప్లీట్ చేసింది కాజల్. ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్ జరుగుతోంది. ప్యాన్ ఇండియా చిత్రం ‘ఉమ’ కూడా ఈమధ్యనే సెట్స్‌కి వెళ్లింది. ‘హే సినామికా’ సినిమా ఆల్రెడీ రిలీజ్‌కి రెడీ అయ్యింది. త్వరలో ఓ టాక్ షోకి హోస్ట్‌గా చేయడానికి కూడా ఆమె రెడీ అవుతోందట. ఇప్పుడేమో ఈ సినిమాకి ఓకే చెప్పిందంటున్నారు. మొత్తానికి క్షణం కూడా తీరిక లేకుండా ఉంది కాజల్.