ఇది గ్రీన్​ బడ్జెట్​ : విశాక ఇండస్ట్రీస్ జాయింట్ ఎండీ వంశీ గడ్డం

ఇది గ్రీన్​ బడ్జెట్​ : విశాక ఇండస్ట్రీస్ జాయింట్ ఎండీ వంశీ గడ్డం

హైదరాబాద్​, వెలుగు: పర్యావరణానికి మేలు చేసేలా ఈసారి బడ్జెట్​లో చాలా నిర్ణయాలు తీసుకున్నారని విశాక ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్​ వంశీ గడ్డం అన్నారు. క్లీన్​ఎనర్జీ,  గ్రీన్ ఫార్మింగ్, గ్రీన్ మొబిలిటీ, గ్రీన్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌లు  వంటి కార్యక్రమాల ద్వారా 2070 నాటికి నెట్​జీరో కార్బన్​ ఎమిషన్స్​టార్గెట్​ను చేరుకుంటామని అన్నారు. 2023 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వృద్ధి ఆధారిత బడ్జెట్‌‌‌‌ను ప్రకటించారని ప్రశంసించారు.  పర్యావరణాన్ని కాపాడటానికి ఈ బడ్జెట్‌‌‌‌లో రెన్యువబుల్​మినిస్ట్రీకి మరిన్ని నిధులు కేటాయించారని, రెన్యువబుల్​ఎనర్జీ ఉత్పత్తి పెంపునకు నిర్ణయాలు తీసుకున్నారని మెచ్చుకున్నారు. అభివృద్ధికి ఇవి కూడా మూలస్తంభాలని, అయితే సోలార్​ రూఫ్​,  ఎలక్ట్రిక్ వెహికల్స్​కు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ‘‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 11.4 కోట్ల మంది రైతులకు డైరెక్ట్​ క్యాష్​ ట్రాన్స్​ఫర్​ పద్ధతిలో రూ.2.2 లక్షల కోట్లు చెల్లిస్తారు.  వ్యవసాయ రంగానికి రూ. 20 లక్షల కోట్లు కేటాయిస్తారు. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది.

రూరల్​ డిమాండ్​ మరింత పెరుగుతుంది.  గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలు పెరుగుతాయి.  మా రూఫింగ్ షీట్‌‌‌‌లకు డిమాండ్‌‌‌‌ అధికమవుతుంది. దేశమంతటా 157 కొత్త నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు  మంత్రి నిర్మల ప్రకటించారు.  రీజనల్​ ఎయిర్​ కనెక్టివిటీని మెరుగుపరచడానికి 50 అదనపు విమానాశ్రయాలు, హెలిప్యాడ్‌‌‌‌లు, వాటర్ ఏరో డ్రోన్‌‌‌‌లు,  అధునాతన ల్యాండింగ్ గ్రౌండ్‌‌‌‌లను అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయం. కాపెక్స్ కేటాయింపును 33శాతం పెంచి రూ. 10 లక్షల కోట్లకు చేర్చారు. ఇది జీడీపీలో 3.3శాతానికి పెరిగింది. ఫలితంగా రోడ్డు, నీరు, పట్టణాభివృద్ధి,  సిమెంట్ రంగాల కంపెనీలకు మేలు జరుగుతుంది. మరింత మందికి సొంతింటి కలను నిజం చేయడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన బడ్జెట్​ను 66 శాతం పెంచి రూ.  79,000 కోట్లకు చేర్చారు. దీనివల్ల కన్​స్ట్రక్షన్స్​మెటీరియల్స్​కు గిరాకీ పెరుగుతుంది.  ఇది బ్యాలెన్స్​డ్​ బడ్జెట్.  భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలోకి తీసుకువెళుతుంది” అని వంశీ వివరించారు.