బ్లాక్‌‌‌‌‌‌‌‌ హోల్స్‌‌పై రీసెర్చ్‌‌కు ముగ్గురికి నోబెల్

బ్లాక్‌‌‌‌‌‌‌‌ హోల్స్‌‌పై రీసెర్చ్‌‌కు ముగ్గురికి నోబెల్

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన రోజర్‌‌‌‌‌‌‌‌ పెన్రోస్‌‌‌‌‌‌‌‌, జర్మనీ నుంచి రెయిన్‌‌‌‌‌‌‌‌హార్డ్‌‌‌‌‌‌‌‌ జెంజెల్‌‌‌‌‌‌‌‌, అమెరికా రీసెర్చర్‌‌‌‌‌‌‌‌ ఆండ్రియా ఘెజ్‌‌‌‌‌‌‌‌లకు ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌లో అవార్డు

బ్లాక్‌‌‌‌‌‌‌‌ హోల్‌‌‌‌‌‌‌‌, మిల్కీ వే సీక్రెట్స్‌‌‌‌‌‌‌‌పై రీసెర్చ్‌‌‌‌‌‌‌‌కు ప్రైజ్‌‌‌‌‌‌‌‌

ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌లో బహుమతి గెలుచుకున్న నాలుగో మహిళ ఆండ్రియా 

స్టాక్‌‌‌‌‌‌‌‌హోం (స్వీడన్‌‌‌‌‌‌‌‌): ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌లో ఈసారి ముగ్గురికి నోబెల్‌‌‌‌‌‌‌‌ పురస్కారం దక్కింది. బ్లాక్‌‌‌‌‌‌‌‌ హోల్‌‌‌‌‌‌‌‌, మిల్కీ వే డార్కెస్ట్‌‌‌‌‌‌‌‌ సీక్రెట్‌‌‌‌‌‌‌‌పై రీసెర్చ్‌‌‌‌‌‌‌‌కుగాను రోజర్‌‌‌‌‌‌‌‌ పెన్రోస్‌‌‌‌‌‌‌‌, రెయిన్‌‌‌‌‌‌‌‌హార్డ్‌‌‌‌‌‌‌‌ జెంజెల్‌‌‌‌‌‌‌‌, ఆండ్రియా ఘెజ్‌‌‌‌‌‌‌‌లు పురస్కారానికి ఎంపికయ్యారు. సగం ప్రైజ్‌‌‌‌‌‌‌‌ను రోజర్‌‌‌‌‌‌‌‌.. మిగతా సగాన్ని రెయిన్‌‌‌‌‌‌‌‌హార్డ్‌‌‌‌‌‌‌‌, ఆండ్రియా పంచుకోనున్నారని రాయల్‌‌‌‌‌‌‌‌ స్వీడిష్‌‌‌‌‌‌‌‌ అకాడమీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ సైన్సెస్‌‌‌‌‌‌‌‌ మంగళవారం వెల్లడించింది. యూనివర్స్‌‌‌‌‌‌‌‌లో బ్లాక్‌‌‌‌‌‌‌‌ హోల్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పడటానికి ఐన్‌‌‌‌‌‌‌‌స్టీన్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ థియరీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ రిలేటివిటీ కారణమని గుర్తించినందుకు రోజర్‌‌‌‌‌‌‌‌ను ప్రైజ్‌‌‌‌‌‌‌‌కు ఎంపిక చేశామని అకాడమీ తెలిపింది. దీన్ని ప్రూవ్‌‌‌‌‌‌‌‌ చేయడానికి ఆయన అద్భుతమైన మ్యాథమెటికల్‌‌‌‌‌‌‌‌ మెథడ్స్‌‌‌‌‌‌‌‌ను వాడారంది. అలాగే మన గెలాక్సీ మధ్యలో కనబడని అతి పెద్ద కాంపాక్ట్‌‌‌‌‌‌‌‌ వస్తువును కనుగొన్న రెయిన్‌‌‌‌‌‌‌‌హార్డ్‌‌‌‌‌‌‌‌, ఆండ్రియాను కూడా అవార్డుకు సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేశామంది. ఈ వస్తువే గెలాక్సీలోని నక్షత్రాల కక్ష్యలను నియంత్రిస్తుందని వివరించింది.

అక్కడ ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌ సూత్రాలు పని చేయవ్‌‌‌‌‌‌‌

బ్లాక్‌‌‌‌‌‌‌‌ హోల్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయని ఐన్‌‌‌‌‌‌‌‌స్టీన్‌‌‌‌‌‌‌‌ నమ్మలేదు.  అయితే వాటిపై పరిశోధన చేసిన రోజర్‌‌‌‌‌‌‌‌.. 1965లో బ్లాక్‌‌‌‌‌‌‌‌ హోల్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పడగలవని వివరంగా చెప్పారు. ఆ హోల్స్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌ సూత్రాలు పని చేయవన్నారు. ఇక రెయిన్‌‌‌‌‌‌‌‌హార్డ్‌‌‌‌‌‌‌‌, ఆండ్రియా 1990 నుంచి రెండు వేర్వేరు ఆస్ట్రొనమర్స్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌లను లీడ్‌‌‌‌‌‌‌‌ చేశారు. వీళ్లంతా మన గెలాక్సీ మధ్యలో ఉన్న ‘సగిట్టారియస్‌‌‌‌‌‌‌‌ ఏ’ గురించి తెలుసుకోవడంపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. మిల్కీ వే మధ్యలో దుమ్ము, ఇంటర్‌‌‌‌‌‌‌‌స్టెల్లార్‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌, మేఘాలతో నిండి ఉండటం, దాని చుట్టూ నక్షత్రాలు తిరుగుతుండటంపై దృష్టి పెట్టారు. మిల్కీ వే మధ్య ప్రాంతానికి దగ్గర్లో ఉన్న కాంతివంతమైన నక్షత్రాల కక్ష్యలను కచ్చితత్వంతో మ్యాప్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆ కక్ష్యల తీరు ప్రకారం గెలాక్సీ మధ్యలో కనబడని బరువైన వస్తువొకటి ఉందని గుర్తించారు. ఆ వస్తువు ఈ స్టార్స్‌‌‌‌‌‌‌‌ను బలంగా లాగుతుండటం వల్ల అవి ఆ వస్తువు చుట్టూ గజిబిజిగా తిరుగుతున్నాయని తెలుసుకున్నారు. ఆ కనబడని వస్తువు మన సూర్యుని బరువు కన్నా 40 లక్షల రెట్లు ఎక్కువ బరువైనదని కనుగొన్నారు. దీన్ని బట్టి ప్రతి గెలాక్సీ మధ్యలో ఓ అతిపెద్ద కనబడని సూపర్‌‌‌‌‌‌‌‌ మాసివ్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌ హోల్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని సైంటిస్టులు అభిప్రాయానికి వచ్చారు. ఈ పరిశోధన కోసం వీళ్లంతా ప్రపంచంలోని అతిపెద్ద టెలిస్కోప్‌‌‌‌‌‌‌‌లను వాడారు. అయితే బ్లాక్‌‌‌‌‌‌‌‌ హోల్‌‌‌‌‌‌‌‌ లోపలి నిర్మాణం ఎలా ఉంటుంది, థియరీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ గ్రావిటీని బ్లాక్‌‌‌‌‌‌‌‌ హోల్‌‌‌‌‌‌‌‌ దగ్గర్లో ఎలా టెస్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలి లాంటి ప్రశ్నలకు మాత్రం ఇంకా జవాబు వెతకాల్సి ఉందని రీసెర్చర్లు
అంటున్నారు.