సెల్ఫీ దిగుతు ముగ్గురు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. రైలు పట్టాలపై సెల్ఫీ దిగుతుండగా ట్రైన్ ఢీకొట్టడంతో యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన హర్యానాలో జరిగింది. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నలుగురు యువకులు పానిపట్ వచ్చారు. పక్కనే రైల్వే ట్రాక్ కనిపించడంతో సెల్ఫీ తీసుకుందామనుకున్నారు. వెనుక నుంచి ట్రైన్ రావడాన్ని గమనించి కూడా సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు. ఈలోపే రైలు దూసుకొచ్చింది.. పక్కకు తప్పకుందామని చూసినా వీలుకాలేదు. రెండో ట్రాక్ పై నుంచి మరో ట్రైన్ వచ్చి ముగ్గుర్ని ఢీకొట్టడంతో చనిపోయారు.
మరో యువకుడు మాత్రం పట్టాలపై నుంచి పక్కు దూకేయడంతో స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. మృతులు చమన్, కిషన్, సన్నీలుగా గుర్తించారు. ముగ్గురు యువకులు రోజూవారీ కూలీలుగా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ కోసం హస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు.