మన చదువులు.. మండేలా బాటలోనే

మన చదువులు.. మండేలా బాటలోనే

ఇవ్వాళ నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా, విద్యా రంగంలో మండేలా ఆలోచనల్ని, అభిప్రాయాల్ని అందరికీ తెలియజేసేదుకు నేను ఈ కాలమ్ రాస్తున్నాను. మండేలా స్ఫూర్తితో మన దేశ విద్యా వ్యవస్థలో క్వాలిటీని పెంచేందుకు ఉన్నఅవకాశాలను చెప్పాలని అనుకుంటున్నాను.మండేలా తన జీవితంపై ఎడ్యుకేషన్ ప్రభావం ఎలా ఉందో తన ఆత్మకథ ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’లో బాగా వివరించారు. జైలులో ఉన్నా, ఆయన కరస్పాండెన్స్ ద్వారా లా చదివారు. 

జీవితంలో అనేక లక్ష్యాలను సాధించడానికి విద్య ఉపయోగపడుతుందని ఆయన భావించారు. ఎడ్యుకేషన్ ద్వారా వ్యక్తిగత అభివృద్ధిని సాధించవచ్చని, అది సమాజంలో సమాన అవకాశాలను పొందడానికి ఉపయోగపడుతుందని మండేలా గట్టిగా చెప్పేవారు. ‘‘విద్య ద్వారా ఒక రైతు కూతురు డాక్టర్ అవ్వొచ్చు, ఒక గని కార్మికుని బిడ్డ అదే గనికి యజమాని కావొచ్చు, ఒక కూలీ బిడ్డ సైతం దేశానికి ప్రెసిడెంట్ కావొచ్చు’’ అని మండేలా అనేవారు. మనిషిలో అన్ని రకాలుగా చైతన్యం కలిగించే సత్తా చదువులో ఉందని ఆయన చెప్పారు.ఎడ్యుకేషన్ అంటే.. ఏదో ఒక డిగ్రీ సాధించడం కాదని, ఈ విషయాన్ని స్వార్థపరులకు వివరించడం కష్టమని మండేలా అనేవారు. బాగా చదువుకున్న వ్యక్తి కంటే కూడా చదువు రాని వ్యక్తే తెలివైన ఓటరుగా నిలబడగలడని చెప్పేవారు.

మన స్టూడెంట్లకు ‘లోకల్’ స్కిల్స్

మనదేశ కొత్త ఎడ్యుకేషనల్ సిస్టం డ్రాఫ్ట్ లోనూ మండేలా భావాలు ఉన్నాయి. ఆయా రంగాల్లోని ఎక్స్ పర్ట్ లకు ప్రొఫెషనల్ డిగ్రీ లేకున్నా.. వారి నుంచి స్కిల్స్, నాలెడ్జ్ ను పొందొచ్చనే విషయాన్ని మన దేశ కొత్త విద్యా విధానం గుర్తించింది. స్కిల్స్ ను అందించే చదువును చెప్పేందుకు.. వడ్రంగులు, మేస్త్రీల వంటి లోకల్ ఎక్స్ పర్టులను విద్యా సంస్థలకు పిలిచి, వారితో ఆయా స్కిల్స్ ను నేర్పించాలన్నదే మన నూతన విద్యా విధానం లక్ష్యం. ఇందులో భాగంగానే, అప్పర్ ప్రైమరీ క్లాసుల స్టూడెంట్లు లోకల్ గా వృత్తిపనివారిని కలిసి స్కిల్స్ నేర్చుకునేలా 10 రోజుల ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని తలపెట్టినం. దీనివల్ల స్టూడెంట్లు స్కిల్స్ ను నేర్చుకోవడమే కాకుండా, అవి సమాజం ఎదుగుదలకు ఎలా ఉపయోగపడతాయో కూడా తెలుసుకుంటారు.

కల్చరల్ హిస్టరీ మరవొద్దన్నరు

ఎడ్యుకేషన్ అనేది పవర్ ఫుల్ వెపన్ అని, దాని ద్వారా ప్రపంచాన్ని మార్చవచ్చని మండేలా అంటారు. చదువు ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, వారు ఎంపవర్ అవుతారని ఆయన నమ్మారు. ఇందుకోసం లోకల్ పరిస్థితులకు అనుగుణంగా చదువు ఉండాలని చెప్పేవారు. చదువు అనేది జాతి నిర్మాణానికి, ప్రజల మధ్య ఐక్యత సాధించడానికి ఉపయోగపడుతుందిని కూడా మండేలా అంటారు. ఆయన ఆలోచనల్ని ఆచరిస్తూ కేంద్ర విద్యా శాఖ కొత్త విధానంతో ముందుకొస్తోంది. మన విద్యాలయాల్లో ఎడ్యుకేషన్ ప్లాన్, టీచింగ్ అనేవి స్టూడెంట్లకు ఫండమెంటల్ డ్యూటీస్, రాజ్యాంగం పట్ల గౌరవం పెంచేలా వుంటుంది. మన స్టూడెంట్లకు దేశంతో అనుబంధం పెంచేలా చేసి, వారి బాధ్యతల పట్ల చైతన్యం కలిగించేలా చేస్తుంది. స్టూడెంట్లు తమ కల్చరల్ హిస్టరీని కూడా మరవరాదు. అంటే తమ సంగీతం, కళలు, నృత్యాలు, భాషలను తెలుసుకోవాలనేది మండేలా అభిప్రాయం. కల్చరల్ అంశాల ద్వారానే తాను తన దేశం గురించి చాలా విషయాలు తెలుసుకున్నట్టు ఆయన అంటారు.  మన దేశానికీ వేల ఏండ్ల గొప్ప కల్చరల్ హిస్టరీ వుంది. ఇండియన్లుగా పుట్టినందుకు గర్వపడేలా మన నూతన విద్యా విధానం స్టూడెంట్లలో స్ఫూర్తిని నింపుతుంది. కొత్త విధానం ద్వారా స్టూడెంట్ల ఆలోచనల్లోనే కాదు వారి చేతల్లోనూ మార్పు వస్తుంది. నాలెడ్జ్ పెరుగుతుంది. స్కిల్స్, వ్యాల్యూస్, విధుల పట్ల అవగాహన వస్తుంది. తద్వారా వారు మానవ హక్కులు, మంచి జీవన విధానం, ప్రపంచ మేలు కోసం కట్టుబడి ఉండే అంతర్జాతీయ పౌరులుగా తమను తాము తీర్చి దిద్దుకుంటారు.

డిసిప్లీన్, హార్డ్ వర్క్, ఫిట్ నెస్ కీలకం

డిసిప్లీన్, హార్డ్ వర్క్, ఫిజికల్ ఫిట్ నెస్ గురించీ మండేలా ప్రత్యేకంగా చెప్పేవారు. వాటిని తన జీవితంలోనూ ఆయన ఆచరించి చూపారు. ‘ఆరోగ్యం బావుంటేనే చక్కగా పని చేయగలను, స్పష్టంగా ఆలోచించగలను అన్నది తెలుసుకున్నాను. అందుకే వ్యాయామం నా జీవితంలో భాగమైంది’ అని ఆయన అనేవారు. అందుకే.. వ్యాయామం, శారీరక ఆరోగ్యాన్ని ప్రజల జీవితంలో భాగం చేయడానికే కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 29న ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది. మన దేశం శతాబ్దాల నుంచి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఈ ఉద్యమం మరోసారి చాటింది. ఈ కార్యక్రమం మండేలా స్ఫూర్తిని కూడా రిఫ్లెక్ట్ చేసింది. దేశవ్యాప్తంగా 13 లక్షల స్కూళ్లలో 11 కోట్ల స్టూడెంట్లు ఫిట్ నెస్ ప్లెడ్జ్ చేశారు. మన కొత్త విద్యా  విధానంలోనూ దీనిని చేర్చాం. ప్రతి స్టూడెంట్ లో సమగ్రమైన అభివృద్ధిని తీసుకురావడంలో భాగంగా ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టబోతున్నది.

మండేలా విజన్ చాలా పవర్ ఫుల్  

విద్యా రంగంపై మండేలా విజన్ చాలా శక్తివంతమైనది. ఆయన స్ఫూర్తితోనే అందరికీ చదువు, విద్యలో సమానత్వం, క్వాలిటీ, ఆర్థికంగా వెసులుబాటు, బాధ్యత అనే మెయిన్ పిల్లర్స్ తో మన దేశ కొత్త విద్యా విధానం రూపొందింది. ఇందులో మండేలా ఆలోచనలకు అనుగుణంగానే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఆయన నుంచి మనం గొప్ప స్ఫూర్తిని తీసుకున్నాం. స్టూడెంట్లలోని క్రియేటివిటీని వెలికి తీసేలా, వారు సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా ఎదిగేలా మన కొత్త ఎడ్యుకేషనల్ సిస్టం తయారైంది. దీని ద్వారా వారు ఇండియాను ప్రపంచంలోనే ప్రముఖ నాలెడ్జ్ సెంటర్ గా నిలపగలుగుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను.

కంప్యూటర్ లిటరసీ గురించీ చెప్పారు

కంప్యూటర్ లిటరసీ విషయంలోనూ మండేలా అభిప్రాయాలు ఇంట్రెస్టింగ్ గా వున్నాయి.  స్టూడెంట్లు గ్రేడ్ 1 స్థాయి నుంచే కంప్యూటర్ లిటరసీపై దృష్టి పెట్టేలా టీచర్లు కృషి చేయాలని ఆయన కోరారు. తద్వారా స్టూడెంట్లు కొత్త టెక్నాలజీపై అవగాహనతో ముందడుగు వేస్తారనేది ఆయన ఆలోచన. ఎలక్ట్రానిక్ లెర్నింగ్ విధానానికి ప్రాధాన్యత పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో ఆయన అభిప్రాయాలకు ఎంతో విలువ ఉందని చెప్పవచ్చు. అందుకే.. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ విద్య కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఒకే దేశం ఒకే డిజిటల్ వేదిక అనే ఆలోచనతో దీక్ష పోర్టల్ ను ప్రారంభించాం. ఒక క్లాస్ ఒక ఛానెల్ ఆలోచనతో టీవీ, కమ్యూనిటీ రేడియో, సీబీఎస్ శిక్షావాణి పాడ్ కాస్ట్, దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందిస్తున్నాం. ఈ కార్యక్రమాలద్వారా పబ్లిక్ డొమెయిన్ లో మంచి ఎలక్ట్రానిక్ స్టడీ మెటీరియల్ అందుబాటులోకి వచ్చింది. అంటే టెక్నాలజీతో విద్యారంగంలో సమానత్వం తీసుకొస్తున్నాం.

తెలంగాణ జిల్లాల్లో కరోనా రిస్క్ ఎక్కువ