బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ.. మోదీ మరోసారి ప్రధాని కాలేడు : రాహుల్ గాంధీ ట్వీట్

బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ..  మోదీ మరోసారి ప్రధాని కాలేడు :   రాహుల్ గాంధీ ట్వీట్

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను ఎడిట్ చేశారని గగ్గోలు పెట్టిన బీజేపీ నేతలు.. ఇప్పుడు రాహుల్ వీడియోను ఎడిట్ చేసి..పైశాచిక ఆనందం పొందుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధాని కాలేరంటూ రాహుల్ మాటలను వక్రీకరిస్తూ.. అదే వీడియోను మరోసారి మోదీ ప్రధాని అవుతారంటూ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు.

దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ. బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ ఎంత ప్రచారం చేసినా... తాను మళ్లీ మళ్లీ చెప్తున్నా.. మోదీ మరోసారి ప్రధాని కాలేరంటూ ట్వీట్ చేశారు. బీజేపీ అబద్ధాల ప్రచారంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ రాహుల్ పై అనేక ఫేక్, మార్ఫింగ్ వీడియోలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతోనే ఇటువంటి ఫేక్ వీడియోలు సర్క్యూలేట్ చేస్తున్నారని మండిపడ్డారు హస్తం లీడర్లు.