హైదరాబాద్లో పోలీస్ ఇంటికే కన్నమేసిన దొంగలు.. అరుణాచలం వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల !

హైదరాబాద్లో పోలీస్ ఇంటికే కన్నమేసిన దొంగలు.. అరుణాచలం వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల !

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని మధురానగర్ కాలనీలో పోలీసు ఉద్యోగి కృష్ణ గౌడ్ ఇంట్లో చోరీ జరిగింది. కృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులు అరుణాచలం వెళ్లడంతో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళాలు విరగొట్టి బంగారు, వెండి ఆభరణాలతో పాటు దుండగులు నగదును దోచుకెళ్లారు. కృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

మరో క్రైం వార్త విషాదం నింపింది. మహేశ్వరంలో ఆన్‌లైన్ బెట్టింగ్లో లక్ష రూపాయలు పోగొట్టుకున్న విద్యార్ది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధి దెబ్బడిగుడాలో వాస్పూరి విక్రమ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వాస్పూరి విక్రమ్ డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు.

►ALSO READ | ఖమ్మం జిల్లా వైరా RTC బస్టాండ్ దగ్గర మద్యం మత్తులో వివాహిత.. ఇద్దరు పిల్లలను వదిలేసి ఏం పనిది..!

ఇంట్లో నుంచి లక్ష రూపాయలు తీసుకెళ్లి ఆన్‌లైన్ గేమ్‌లో బాధితుడు లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. డబ్బులు పోగొట్టుకున్న విక్రమ్ మనస్థాపానికి గురై పొలం దగ్గర పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు విక్రమ్ను గాంధీ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విక్రమ్ అన్నయ్య శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.