చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులు భేటీ

చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులు భేటీ

సినీ నటుడు చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు.ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు చిరంజీవిని.. ఏపీ సీఎం జగన్ ఆహ్వానించారు.ఈ నెలాఖరున జగన్ తో మీటింగ్ నేపథ్యంలో చిరంజీవి ఇంట్లో  నిన్న సాయంత్రం సమావేశం జరిగింది. నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు, ఆర్.నారాయణ మూర్తి, ఎన్వీ ప్రసాద్, సి.కల్యాణ్, వీవీ వినాయక్, కొరటాల శివ హాజరయ్యారు. సినీ, థియేటర్ కార్మికుల సమస్యలు, విద్యుత్ టారిఫ్, టికెట్ రేట్లుపై చర్చించారు.