రైల్వే ట్రాక్ పై వంద స్పీడ్ కు అనుమతి : కమిషనర్  మాధవి 

రైల్వే ట్రాక్ పై వంద స్పీడ్ కు అనుమతి :  కమిషనర్  మాధవి 
  • రైల్వే సౌత్ సేఫ్టీ కమిషనర్  మాధవి 

నవీపేట్, వెలుగు  : కొత్తగా నిర్మించిన రైల్వే ట్రాక్ పై గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ తో రైల్స్ నడపడానికి అనుమతి ఇచ్చినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సికిందరాబాద్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా బాసర నుంచి నవీపేట్ వరకు నూతనంగా నిర్మించిన రెండో లైన్ సామర్థ్యాన్ని పరిశీలించారు.

అనంతరం ప్రత్యేక రైలులో బాసర నుంచి నవీపేట్ వరకు ట్రాక్ పై ప్రయాణించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొత్త ట్రాక్ పై ప్రస్తుతం గంటకు 100 స్పీడ్ తో నడపడానికి అనుమతించినట్లు  తెలిపారు.  సీఏవో రణధీర్ రెడ్డి, డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వేర్మా, హైదరాబాద్ డివిజన్ మేనేజర్ రణధీర్ అధికారులు పాల్గొన్నారు.