కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈగల్ ఫోర్స్ దాడులు.. 10 మంది గంజాయి వినియోగదారులు అరెస్ట్

కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈగల్ ఫోర్స్ దాడులు.. 10 మంది గంజాయి వినియోగదారులు అరెస్ట్

గంజాయి వినియోగంపై నార్కోటిక్స్ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం బిగిస్తున్నారు. వరుస రైడ్లతో గంజాయి స్మగర్లకు నిద్రలేకుండా చేస్తున్న పోలీసులు.. 2026 ఏప్రిల్ 02న కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో స్పెషల్ రైడ్స్ నిర్వహించారు. ప్రాంతీయ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్, స్థానిక పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో  10 మంది గంజాయి వినియోగదారులు పట్టుబడ్డారు.

నిందితులకు నిర్వహించిన పరీక్షల్లో THC (టెట్రాహైడ్రో కెనాబినాల్) పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితులను సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు.  
G.O.Ms.No.4 ప్రకారం డీ-అడిక్షన్ సెంటర్లకు పంపించే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం శిక్షతో పాటు పునరావాసం, నివారణ చర్యలపై కూడా దృష్టి పెట్టినట్లు ఈ సందర్భంగా తెలిపారు.