ఇంత నిర్లక్ష్యమా..? హెడ్ లైట్లు లేకుండా 90 కిలోమీటర్లు ప్రయాణించిన బస్సు..! వీడియో వైరల్

ఇంత నిర్లక్ష్యమా..? హెడ్ లైట్లు లేకుండా 90 కిలోమీటర్లు ప్రయాణించిన బస్సు..! వీడియో వైరల్

డ్రైవర్ పైనే భారం వేసి బస్సెక్కిన ప్రయాణికుల ప్రాణాలను రిస్కులో పెట్టి 90 కిలోమీటర్లు తీసుకెళ్లిన డ్రైవర్ వీడియో వైరల్ గా మారింది. చిమ్మ చీకట్లో, హైవేపైన కండక్టర్ ఫోన్ లైటు వేస్తుంటే.. బస్సు నడిపాడు డ్రైవర్. కర్ణాటకలో  జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

కర్ణాటక ఆర్టీసీ (KKRTC) బస్సును హెడ్ లైట్స్ లేకుండా కేవలం కండక్టర్ వేసే ఫోన్ లైట్ ఆధారంగా బస్సును నడిపించారు. కలబురగీ సిటీ నుంచి చించోలీ టౌన్ వరకు.. దాదాపు 90 కిలోమీటర్లు తీసుకెళ్లారు. చిమ్మ చీకటిలో మొబైల్ టార్చ్ లైట్ మాత్రమే వినియోగించి అంత దూరం తీసుకెళ్లడం రాజకీయ వర్గాల్లోనూ విమర్శలకు దారి తీసింది. 

►ALSO READ | తక్షణమే ఆ యాడ్స్ తొలగించండి: ఇన్‎స్టా‎గ్రామ్‎కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

వైరల్ అవుతున్న వీడియోపై KKRTC స్పందించింది. బస్సు హెడ్ లైట్ వైరింగ్ లో సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు చెప్పారు. 

సాయంత్రం 7.30 గంటలకు కలబురగి నుంచి బయలుదేరిన బస్సు, అర్ధరాత్రి దాటిన తర్వాత చిన్చోలికి చేరుకుంది. బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు. గత మూడు రోజులుగా బస్సు ఇదే స్థితిలో నడుస్తోందని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా ఇలాగే నడుస్తున్నా  ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నలు అధికమవుతున్నాయి. అయితే ఆ బస్సును మార్చి.. మరో బస్సును నడిపుతున్నట్లు అధికారులు తెలిపారు. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.