రాచకొండ పరిధిలో 15 మంది సీఐలు బదిలీ

రాచకొండ పరిధిలో 15 మంది సీఐలు బదిలీ

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 15 పోలీస్ స్టేషన్లలో ఇన్ స్పెక్టర్ల బదిలీలు, పోస్టింగ్ లు జరిగాయి. లిస్టులో ఉన్న పదిహేను మంది ఇన్ స్పెక్టర్లకు వెంటనే వారికి అప్పగించిన బాధ్యతల్లోకి మారిపోవాలని కమిషనరేట్ ఆదేశాలు జారీచేసింది. బాధ్యులైన డీసీపీలు, ఏసీపీలు ఈ బదిలీలు, పోస్టింగ్స్ ను పరిశీలించి… ఇన్ స్పెక్టర్లను రిలీవ్ చేయాలని సూచించారు ఉన్నతాధికారులు.