జగ్గారెడ్డికి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సవాల్

జగ్గారెడ్డికి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సవాల్

సంగారెడ్డి జిల్లా: అవినీతి, అక్రమాల పై బహిరంగ చర్చకు సిద్ధమా..  అంటూ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి సవాల్ విసిరారు. ఈ రోజున సంగారెడ్డి లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చింతా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా… ప్రజలకు కనీసం అందుబాటులో లేకుండా జగ్గారెడ్డి అధికార పక్షంపై విమర్శలు చేస్తున్నాడన్నారు. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడే హక్కే లేదని అన్నారు. త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం జగ్గారెడ్డి మాయ మాటలు చెబుతున్నాడన్నారు.

ఓట్లు వేసిన ప్రజలకు సేవ చేయకుండా… జగ్గారెడ్డి అవినీతి, అక్రమలు  చేశారని చింతా ప్రభాకర్ ఆరోపించారు. ఆయన్ను చూసి ఓట్లు వేసిన ప్రజలు ఈసాడించుకుంటున్నారని తెలిపారు. సింగూర్ ప్రాజెక్ట్ గురించి జగ్గారెడ్డి  ప్రతీసారి అవగాహన లేమితో అవాస్తవాలు మాట్లాడుతున్నాడని అన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా 2005, 2008, 2015 లో సింగూర్ ప్రాజెక్ట్ పూర్తిగా ఎండిపోయిందని, ప్రాజెక్ట్ ఎండిపోయిడం కొత్తమీ కాదన్నారు ప్రభాకర్.