అతను ఊహించి ఉండడు.. స్వయంగా ప్రధాని లాంటి వ్యక్తి తన షాపుకు వచ్చి వస్తువులు కొనుగోలు చేస్తాడని.. భాయ్ హమే అప్నా ఝల్ మురి ఖిలావో అని ప్రధాని అడగడంతో అతడికి నోట మాటలు రాలేదు. వీధిలో ఏదో మూలన ఉన్న తన చిన్న కొట్టుకు వచ్చి స్వయంగా దేశ ప్రధాని ఝల్మూరి అడగడంతో ఆనందంతో ఎగిరి గంతేశాడు. స్పెషల్ ప్యాక్ లో ఝల్మూరి కట్టి ప్రధానికి అందజేశాడు. దీనికి సంబంధించిన వీడియోలో మోదీ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో పోస్ట్ చేశారు. ఇదంతా ఏప్రిల్ 19, 2026న పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం.. పర్యటన సందర్భంగా జరిగింది.
ఆ వీడియోలో ఎన్నికల ప్రచారం మధ్యలో సరదాగా ఝర్ గ్రామ్ లో పర్యటించారు ప్రధాని. ఓ ఝల్ మురి షాపుకు వెళ్లినట్లు కనిపిస్తోంది.. అక్కడ ఝల్ మురి కొనుగోలు చేసి షాపువాడికి డబ్బులు కూడా ఇచ్చారు మోదీ.దీంతో ఆ షాపు కుర్రాడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అనంతరం షాపు కుర్రాడితో ముచ్చటించారు ప్రధాని.. స్థానికులకు కూడా ఝల్ మురి తినిపించిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూసి నెటిజనర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘‘సార్, మీరు ఒక సాధారణ టీకి ప్రజాదరణను తెచ్చిపెట్టారు, దాని ఫలితంగా ఇప్పుడు స్టార్టప్‌లు వివిధ టీ బ్రాండ్‌లలో చిన్న కేఫ్‌లను ప్రారంభించి గొప్ప విజయాన్ని సాధించాయి. మీరు స్లీవ్‌లు లేకుండా ఒక స్మార్ట్ లుక్ ఇవ్వడం ద్వారా, రౌండ్ నెక్ జాకెట్‌ను ఇప్పుడు మోడీ జాకెట్ అని పిలవబడే దానిగా మార్చారు. మీరు ప్రపంచ నాయకులకు ఒక పనిని చేసే అలవాటును కలిగించారు.’’అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు.
మరో నెటిజన్ స్పందిస్తూ.. మీరు స్వయంగా నగదు రూపంలో చెల్లింపులు చేస్తూ, మిగతా అందరినీ డిజిటల్ చెల్లింపులను ఉపయోగించమని కోరుతున్నారంటూ డిజిటల్ లావాదేవీలపై సెటైరికల్ గా కామెంట్ చేశారు.
ఇక కొందరు నెటిజన్లు ఇదంతా ఎన్నికల్ స్టంట్ అంటూ కొట్టిపారేశారు. ‘‘మోదీ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, గొప్ప నటుడు కూడా..ఆయన చేస్తున్నదంతా నటనకు ఏమాత్రం తీసిపోదు.ప్రతిదీ ముందే ప్రణాళిక వేసుకున్నదే.. అంటూ సెటర్లు వేశారు.
ఇలా రకరకాలుగా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ప్రధానిమోదీ ఝర్ గ్రామ్ పర్యటనలో పశ్చిమ బెంగాల్ కు చెందిన రెండు విషయాలు అందరి దృష్టిలో పడ్డాయి. ఆ ప్రాంతంలో ఫేమస్ అయిన ఝల్ మురి ఇప్పుడు అందరిని నోరూరిస్తుండగా.. ప్రధాని స్వయంగా తన షాపుకు వచ్చి కొనుగోలు చేయడంతో ఆషాపు కుర్రాడి కళ్లలో ఆనందంతో వెలిగిపోవడం హైలైట్ గా నిలిచాయి.

