V6 News

ఎడ్ సెట్కు 86 శాతం హాజరు

ఎడ్ సెట్కు 86 శాతం హాజరు

హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల బీఈడీ అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్ ఎడ్ సెట్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం మూడు సెషన్లలో జరిగిన ఈ పరీక్షకు 86.6శాతం మంది హాజరయ్యారు.

మొత్తం 31,725 మందికి గానూ 27,495 మంది అటెండ్ అయినట్టు ఎడ్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ చెప్పారు.  కాగా, మహాత్మాగాంధీ వర్సిటీలో పరీక్షల నిర్వహణను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, వర్సిటీ వీసీ గోపాల్ రెడ్డి, రిజిస్ర్టార్ కృష్ణారావు తదితరులు పర్యవేక్షించారు.