V6 News

Vastu tips: వాటర్ సంప్ నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. దిక్సూచి తేడా 10 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే నష్టాలుంటాయా..!

Vastu tips: వాటర్ సంప్  నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. దిక్సూచి తేడా 10 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే నష్టాలుంటాయా..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం.. సంపు.. ఇంకుడు గుంత  ..మెట్ల  విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..  స్థలం కొనేటప్పుడు  దిక్సూచి పది డిగ్రీల కంటే  ఎక్కువ తేడా ఉంటే  దోషం ఉంటుందా..  మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న: ఈశాన్యంలో సంపు ఉండొచ్చా? ఇంటికి ఆగ్నేయంలో మెట్లు ఉన్నాయి. మెట్లముందు ఈశాన్యంలో సంపు లేదా ఇంకుడుగుంత పెట్టవచ్చా?

జవాబు: ఈశాన్యంలో సంపు ఉండొచ్చు. ఈ విషయంలో కొన్ని రూల్స్ పాటిస్తే మంచిది. ఏ ఇంటికైనా గుంతలు దక్షిణ నైరుతి, పడమర నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం దిక్కుల్లో ఉండరాదు. తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యంలో మాత్రమే ఇంకుడు గంతలు, సంపులు ఉండొచ్చని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్ అంటున్నారు

 ప్రశ్న: దిక్సూచితో చూసినప్పుడు పది డిగ్రీలకంటే ఎక్కువ తేడా ఉన్న స్థలం కొనుక్కోవద్దన్నారు. ఈ విషయంలో ఎలాంటి రూల్ పాటిస్తే మంచిది?

జవాబు: ఇందులో ఎలాంటి దోషం లేదు. పది డిగ్రీలకంటే ఎక్కువ తేడా ఉన్న స్థలమైనా కొనుక్కుని ఇల్లు కట్టుకోవచ్చు. ఈ రోజుల్లో ఇది పెద్ద దోషం కాదు. అయితే, 45 డిగ్రీలు దాటితే మాత్రం స్థలం విషయంలో ఆలోచించాలి. అప్పుడు ఇతర దిక్కులు, మిగతా అంశాల్ని పరిశీలించాలి. 45 డిగ్రీలకంటే తక్కువ లోపం ఉంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్ చెబుతున్నారు.