- నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కేజీబీవీలను బలోపేతం చేస్తున్నామని నాగర్ కర్నూల్కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం తెలకపల్లి మండలం రాకొండలో ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్‌రెడ్డితో కలిసి కేజీబీవీ అదనపు గదులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అనంతరం, ఇంటర్మీడియట్ ఫలితాల్లో 990 మార్కులు సాధించిన అనుషను కలెక్టర్, ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. డీఈఓ రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.

