మహబూబ్ నగర్ రూరల్: జాతీయ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి..

మహబూబ్ నగర్ రూరల్: జాతీయ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి..
  • వివరాలు వెల్లడించిన పీయూ రిజిస్ట్రార్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే విజన్ ఇండియా–2047 జాతీయ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్​ పూస రమేశ్​బాబు తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్​ బిల్డింగ్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రారంభోత్సవానికి మంత్రి దామోదర రాజనర్సింహ, ముగింపు కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. శుక్రవారం కన్హ శాంతివనంలో జరిగే కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన వీసీలు, రిజిస్ట్రార్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రతినిధులు, పరిశోధకులు పాల్గొంటారని తెలిపారు.

శనివారం పాలమూరు యూనివర్సిటీ సెంట్రల్  లైబ్రరీ ఆడిటోరియంలో టెక్నికల్  సెషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరిశోధకుల ప్రదర్శనలు, నిపుణులతో శాస్త్రీయ చర్చలు జరుగుతాయని చెప్పారు. సదస్సు కన్వీనర్లు మధుసూదన్ రెడ్డి, కె. ప్రవీణ, నూర్జహాన్, పీఆర్వో ఎం.గాలెన్న, కో ఆర్డినేటర్  శేకుంటి రవి కుమార్ పాల్గొన్నారు.