V6 News

దివంగత ఎమ్మెల్యే సాయన్న సతీమణి గీత మృతి..

దివంగత ఎమ్మెల్యే సాయన్న సతీమణి గీత మృతి..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే జీ. సాయన్న కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి గీత అనారోగ్య కారణాలతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ( ఏప్రిల్ 22 ) మధ్యాహ్నం మృతి చెందారు..గీత మృతదేహాన్ని అశోక్ నగర్ లోని స్వగృహానికి తరలించారు కుటుంబసభ్యులు. గీత మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

గీత మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాయన్న కుటుంబంలో వరుస దుర్ఘటనలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. మూడేళ్ళ కిందట సాయన్న మరణించడం... ఆ తర్వాత ఏడాదిన్నరకే ఆయన కూతురు లాస్య నందిత హఠాన్మరణం వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. ఇప్పుడు గీత మృతితో సాయన్న కుటుంబం మరింత విషాదంలో మునిగిపోయింది.

బీఆర్ఎస్ శ్రేణులు, రాజకీయ ప్రముఖులు గీత మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబసభ్యులకు మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నారు.