టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. మరో రెండు పరీక్షల తేదీలు ప్రకటన..

టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. మరో రెండు పరీక్షల తేదీలు ప్రకటన..

పేపర్ లీకేజీ కారణంగా రద్దయిన మరో రెండు పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అకౌంట్స్‌ ఆఫీసర్‌ నియామక పరీక్ష, జూనియర్‌ లెక్చరర్ల నియామక పరీక్షల తేదీలను వెల్లడించింది. ఆగస్టు 8న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అకౌంట్స్‌ ఆఫీసర్‌ నియామక పరీక్ష జరగనుంది. ఇక సెప్టెంబరు 12 నుంచి అక్టోబరు 10 వరకు జూనియర్‌ లెక్చరర్ల నియామక పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 

అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు ఎన్ని..

తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 31 నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 పోస్టులకు భర్తీచేయాలని భావించారు. వీటిలో అకౌంట్స్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-13, సీనియర్ అకౌంటెంట్-64 పోస్టులు ఉన్నాయి.

ఎన్ని జూనియర్ లెక్చరర్ పోస్టులు..

తెలంగాణలో గతేడాది డిసెంబర్ 10వ తేదీన జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు  నోటిఫికేషన్‌ విడుదలైంది.1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు డిసెంబర్‌ 16 2022  నుంచి  జనవరి 6 2023 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు అభ్యర్థులు చేసుకున్నారు. 

సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు

అరబిక్‌ పోస్టులు: 2, బోటనీ పోస్టులు: 113, బోటనీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15, కెమిస్ట్రీ పోస్టులు: 113, కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 19, సివిక్స్‌ పోస్టులు: 56, సివిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 1, సివిక్స్‌ (మరాఠీ) పోస్టులు: 1, కామర్స్‌ పోస్టులు: 50, కామర్స్‌ (ఉర్దూ మీడియం) పోస్టులు: 7, ఎకనామిక్స్‌ పోస్టులు: 81, ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15, ఇంగ్లిష్‌ పోస్టులు: 153, ఫ్రెంచ్‌ పోస్టులు: 2, హిందీ పోస్టులు: 117, హిస్టరీ పోస్టులు: 77, హిస్టరీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 17, హిస్టరీ (మరాఠీ) పోస్టులు: 1, మ్యాథమెటిక్స్‌ పోస్టులు: 154, మ్యాథమెటిక్స్‌ (ఉర్దూ మీడియం) పోస్టులు: 9, ఫిజిక్స్ పోస్టులు: 112, ఫిజిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18, సంస్కృతం పోస్టులు: 10, తెలుగు పోస్టులు: 60, ఉర్దూ పోస్టులు: 28, జువాలజీ పోస్టులు: 128, జువాలజీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18 ఉన్నాయి.