ఏఈ ఎగ్జామ్ తేదీ మార్పు

ఏఈ ఎగ్జామ్ తేదీ మార్పు

హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఎగ్జామ్ తేదీని టీఎస్పీఎస్సీ శనివారం మార్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల12న పరీక్ష జరగాల్సి ఉండగా.. మార్చి 5కు పోస్ట్ పోన్ చేసింది. ఫిబ్రవరి12న గేట్ ఎగ్జామ్​ఉండడంతో పలువురు అభ్యర్థులు ఏఈ ఎగ్జామ్ ​తేదీని మార్చాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు టీఎస్పీఎస్సీ  పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.