హైదరాబాద్ కాప్రాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత...సీజ్ చేసిన బిల్డింగ్ ను మళ్ళీ నిర్మాణం..

హైదరాబాద్ కాప్రాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత...సీజ్ చేసిన బిల్డింగ్ ను మళ్ళీ నిర్మాణం..

హైదరాబాద్ కాప్రా సర్కిల్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీల సాయంతో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లిలో అక్రమం నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు.

గతంలో మూడుసార్లు నోటీసు ఇచ్చి కూల్చేతలు చేపట్టినా, బిల్డింగ్ సీజ్ చేసినా  మళ్లీ నిర్మాణాలు చేపట్టారని తెలిపారు అధికారులు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న బిల్డింగ్ లను ఉదయం నుండి కూల్చివేస్తున్నామని తెలిపారు అధికారులు. జి ప్లస్ టు అనుమతులు తీసుకొని ఎక్స్ట్రా ఫ్లోర్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో  నిర్మాణాలను సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు.

సీజ్ చేసిన బిల్డింగ్లను మళ్లీ నిర్మాణాలు చేస్తూ అధికారులను భయభ్రాంతులను గురి చేయడంతో చర్లపల్లి పిఎస్ లో నిర్మాణదారునిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.