మా నాన్న ఎమ్మెల్యే.. నా కారునే ఆపుతావా.. నడిరోడ్డుపై బీజేపీ నేత కొడుకు వీరంగం

మా నాన్న ఎమ్మెల్యే.. నా కారునే ఆపుతావా.. నడిరోడ్డుపై బీజేపీ నేత కొడుకు వీరంగం

నైనిటాల్.. ఉత్తరాఖండ్ లోని బిజియెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. ఇక్కడ రోడ్లు ఎప్పుడు రద్దీగానే ఉంటాయి.అయితే ఇటీవల  ఆ ప్రాంతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. నైనిటాల్ లో ట్రాఫిక్ తో రద్దీగా ఉన్న రోడ్లపై  స్థానిక ఎమ్మెల్యే కొడుకు  వీరంగం సృష్టించాడు.  హారన్ మోగిస్తూ.. దూకుడుగా కారును ముందుకు నడిపిస్తూ.. ఇదేంది అని అడిగినందుకు ఓ న్యాయమూర్తితో  గొడవకు దిగాడు. ఇదంతా చూస్తున్న పర్యాటకుడు  తన సెల్ ఫోన్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. 

నైనిటాల్ లోని మాల్ రోడ్డులో ట్రాఫిక్  నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఓ న్యాయమూర్తితో  గొడవకు దిగడంతో  స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర పటేల్ కొడుకు రాహుల్ పటేల్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఫర్చూనర్ కారును సీజ్ చేశారు. 

టూరిస్టులతో రద్దీగా ఉన్న మాల్ రోడ్డుపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయిన క్రమంలో ఈ ఘటన జరిగింది.  ట్రాఫిక్ లో ఉన్న రాహుల్ పెద్దగా  సైరన్ మోగిస్తూ వాహనాలను గుద్దుకుంటూ దూకుడుగా కారు నడిపాడు. సరిగ్గా అతని వాహానం ముందు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నవాజిష్ ఖలీఖ్ ఉంది. మొదట అంబులెన్స్ అని దారి ఇచ్చారు ఎస్ డీఎం. అయినప్పటికీ సైరన్ మోగిస్తుండటంతో ఎస్డీఎం జోక్యం చేసుకోవడం తీవ్ర వాగ్వాదం జరిగింది. మా నాన్న ఎమ్మెల్యే అంటూ ఎస్డీఎంపై దురుసుగా రాహుల్ పటేల్ ప్రవర్తించినట్లు  నవాజిష్ ఖలీఖ్ ఫిర్యాదు చేశారు. 

ALSO READ : టీవీకే విజయ్ రోడ్ షోలో వింత ఘటన..

రోడ్డు మధ్యలో గొడవ ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్ పటేల్ అను అదుపులోకి తీసుకున్నారు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడమే కాకుండా అతని కారుకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడం, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడంతో  మోటార్ వెహకల్ యాక్టు ప్రకారం పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. చలాన్లు జారీ చేశారు. ఈ ఘటనలో  రాహుల్ పటేల్ కోర్టుకు వెళ్లి తన కారును తీసుకోవాల్సి వచ్చింది.