ఇన్‌‌సర్వీస్‌‌ టీచర్ల టెట్‌‌ నోటిఫికేషన్‌‌ వాయిదా వేయాలి : టీఎస్‌‌పీటీఏ

ఇన్‌‌సర్వీస్‌‌ టీచర్ల టెట్‌‌ నోటిఫికేషన్‌‌ వాయిదా వేయాలి : టీఎస్‌‌పీటీఏ
  •     అక్టోబర్‌‌ 1న నోటిఫికేషన్‌‌ జారీ చేయొద్దని టీఎస్‌‌పీటీఏ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఇన్‌‌సర్వీస్‌‌ టీచర్లకు నిర్వహించే టెట్‌‌ పరీక్ష నోటిఫికేషన్‌‌ను అక్టోబర్‌‌ 1న జారీ చేయొద్దని తెలంగాణ స్టేట్‌‌ ప్రైమరీ టీచర్స్‌‌ అసోసియేషన్‌‌ (టీఎస్‌‌పీటీఏ) రాష్ట్ర అధ్య క్షుడు సయ్యద్‌‌ షౌకత్‌‌ అలీ, ప్రధాన కార్యదర్శి రోహిత్‌‌ నాయక్‌‌ ప్రభుత్వాన్ని కోరారు. నోటిఫికేషన్‌‌ జారీకి, పరీక్షకు మధ్య కనీసం 3 నెలల సమయం ఉండేలా చూడాలని శుక్రవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

అక్టోబర్‌‌ 1న జారీ చేయాల్సిన నోటిఫికేషన్‌‌ను డిసెంబర్‌‌కు వాయిదా వేయాలని కోరారు. ఈ 3నెలల వ్యవధిలో టెట్‌‌కు సన్నద్ధం కావడానికి టీచర్లకు తగిన సమయం లభిస్తుందన్నారు. ఒకవేళ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయినా, తదుపరి పరీక్షకు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంద న్నారు. టీచర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నోటిఫికేషన్‌‌ను డిసెంబర్‌‌కు వాయిదా వేయాల ని వారు ప్రభుత్వాన్ని కోరారు.