మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ నివాళులర్పించారు. సోనియా గాంధీ, రాహుల్ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మన్మోహన్ నివాసానికి వెళ్లి ప్రార్థనా సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణ లు దేశ రూపురేఖలనే మార్చేశాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గుర్తుచేసుకున్నారు. ‘మాజీ ప్రధాని మన్మోహన్ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. ప్రజా జీవితంలో ఎన్నో ఏండ్లు గడిపిన ఆయన, దేశానికి పూర్తి అంకితభావంతో సేవలందించారు’’ అని ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
