ఫైన్ వేసి.. హెల్మెట్ ఇచ్చారు

ఫైన్ వేసి.. హెల్మెట్ ఇచ్చారు

జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా రాచకొండ పోలీసులు ఎల్ బీనగర్ చౌరస్తా, బొంగులూరు గేట్, బైరామల్ గూడలో వండర్ లా సహకారంతో రోడ్ సేఫ్టీ, హెల్మెట్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్న వారిని ఆపి.. ఫైన్ విధించి హెల్మెట్లు పంపిణీ చేశారు. మొత్తం 100 మందికి హెల్మెట్లు ఇచ్చినట్టు ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్ అన్నారు. రోడ్ సేఫ్టీలో భాగంగా ఈ ప్రోగ్రామ్ నిర్వహించా మన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ప్రదీప్ బాబు, నాగరాజు, ఇస్మాయిల్ పాల్గొ న్నారు.

ఎల్ బీనగర్, వెలుగు