నీటి సంపులో పడి రెండేండ్ల బాలుడు మృతి

నీటి సంపులో పడి రెండేండ్ల బాలుడు మృతి

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ పరిధిలో శుక్రవారం ఓ రెండేండ్ల బాలుడు నీటి సంపులో పడి చనిపోయాడు. శాస్త్రి నగర్‌‌‌‌కు చెందిన వెంకటకృష్ణ, సౌమ్య దంపతులకు ఇద్దరు కొడుకులు. చిన్నవాడు ఆదిత్య(2) శుక్రవారం ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలో ఉన్న సంపులో పడ్డాడు. అలికిడి లేకపోవడంతో పక్కనే ఉన్న నానమ్మ ఇంట్లోకి వెళ్లాడని తల్లిదండ్రులు భావించారు. కొంతసేపటి తర్వాత అక్కడా కనబడకపోవడంతో చుట్టూ వెతికారు. చివరకు నీటి సంపులో విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పైకి తీసి హాస్పిటల్‌‌కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.