50 లక్షలు దాటిన V6 యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్

50 లక్షలు దాటిన V6 యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్

వీ6 యూట్యూబ్ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 50 లక్షలు దాటింది. గాసిప్స్‌లేని వార్తలు అందించే ఛానెల్‌కు అందలం ఇచ్చిన వ్యూయర్స్ సరికొత్త సెన్సేషన్‌కు సృష్టికర్తలయ్యారు. యూట్యూబ్ ఛానెల్ పెట్టిన మూడేళ్లలోనే 10 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లను సాధించి.. తెలుగు మీడియాలో రంగంలో అప్పట్లోనే V6 సంచలనం సృష్టించింది. సాధారణంగా న్యూస్ ఛానెళ్లకుకు పెద్దగా సబ్‌స్క్రైబర్లు ఉండరు. కానీ.. V6 యూట్యూబ్ ఛానెల్ మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్థాయిలో ఎక్కువ సబ్‌స్క్రైబర్లను సాధించి అప్పట్లోనే ట్రెండ్ క్రియేట్ చేసింది.

వాస్తవాలు మాత్రమే అందించే V6కు జనం నీరాజనాలు పలికారు. కట్టుకథలు, గాసిప్స్ లేని వార్తలను మెచ్చారు. వార్తల కోసమే V6ను ఇంతమంది ఫాలో కావడం విశేషం. తమ ఆలోచనలకు, అభిప్రాయాలకు దగ్గరగా ఉండటంతో… V6 న్యూస్ ఛానెల్‌ను యువత దగ్గరుండి నడిపిస్తున్నారు. ప్రతి దృశ్యం.. ప్రజల పక్షం అనే ట్యాగ్ లైన్‌కు అనుగుణంగా… పక్షపాతంలేని వార్తలు అందించినందుకు అన్నివర్గాల ప్రజలు V6కు మద్దతుగా నిలిచారు.

తెలంగాణ ప్రజల వాయిస్.. చాయిస్ V6. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచి ఇప్పటివరకు ప్రజల పక్షానే నిలిచింది V6 న్యూస్ ఛానెల్. జనం ఆకాంక్షలు, ఆశలకు వేదికగా నిలిచింది. తెలంగాణ యాస, భాషకు గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అందుకే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. V6లో వస్తేనే అది అఫీషియల్ అని నమ్ముతామని చాలామంది చెబుతుంటారు. న్యూస్ ఏదైనా సరే.. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ ఉన్నా అది V6లో వస్తేనే కరెక్ట్ అని నమ్ముతారు. సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడితే.. V6 వాళ్లయితేనే కరెక్ట్‌గా ప్రెజెంట్ చేస్తారని బల్లగుద్ది చెబుతారు. సర్కారు ఆదేశాలైనా.. అపోజిషన్ విమర్శలైనా.. జనం ఇబ్బందులైనా.. రైతుల సమస్యలైనా.. ఆర్టీసీ కార్మికుల తిప్పలైనా.. నేతన్నల బాధలైనా.. పేదల కష్టాలైనా… కళాకారుల ఆటపాటలైనా V6 ఛానెల్ యాజిటీజ్‌గా చూపిస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా.. జరిగింది జరిగినట్టుగా…. కల్పితాలు జోడించకుండా… ఖచ్చితమైన వార్తలను మాత్రమే ఇస్తుంది. వార్తల్లో అనవసర వ్యాఖ్యానాలు ఉండవు.. అర్థంలేని పోలికలు అస్సలుండవు. దోస్త్ ముచ్చట చెప్పినట్టు.. ఒక్కమాటలో మ్యాటర్ అర్థమయ్యేట్టు.. వాడుక పదాల్లో వార్తలను ప్రసారం చేస్తుంది. అందుకే జనం V6 వార్తలకు పట్టం కట్టి.. తమ గుండెల్లో పెట్టుకున్నారు. V6కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు.. ఛానెల్ వార్తలను షేర్ చేస్తూ వైరల్ చేస్తారు. లక్షలు.. మిలియన్లలో వచ్చే వ్యూసే అందుకు సాక్ష్యం. ఛానెల్‌పై ఉన్న విశ్వసనీయతకు ఇది ఓ ఉదాహరణ.

మార్కెట్‌లో రేటింగ్స్ కోసం న్యూస్ ఛానెల్స్ మధ్య కాంపిటేషన్ ఉన్నా… విలువలకు, విలువైన వార్తలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వస్తోంది V6 తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలకు ప్రయార్టీ ఇస్తూ… డిఫరెంట్ ప్రోగ్రామ్స్‌తో జనానికి దగ్గరయింది. ఫేక్ న్యూస్, హైప్ న్యూస్‌లకు దూరంగా.. మన భాషలోనే క్రెడిబుల్ న్యూస్ మాత్రమే మీకు అందించే ఎఫర్ట్.. ఇకముందు కూడా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాం. ఇంతగా ఆదరించిన ప్రేక్షక లోకానికి, సోషల్ ప్రపంచానికి V6 ధన్యవాదాలు.

For More News..

భార్యను డెలివరీ కోసం ఇండియాకు పంపించి..

జర్నలిస్ట్ మనోజ్ మరణానికి బాధ్యులెవరు?

కరెంట్ బిల్ @2లక్షలు..

ఆర్థికపరిస్థితులతో పోర్న్ ఇండస్ట్రీలోకి మహిళా రేసర్

టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేది ఇలాగే..