టోక్యో అథ్లెట్లందరికీ వ్యాక్సినేషన్​

టోక్యో అథ్లెట్లందరికీ వ్యాక్సినేషన్​

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్​ను పూర్తి చేస్తామని ఇండియన్​ ఒలింపిక్​ అసోసియేషన్​ (ఐవోఏ).. ఇంటర్నేషనల్​ బాడీకి హామీ ఇచ్చింది. వీలైనంత మేరకు ఒలింపిక్స్​కు వెళ్లే ఇండియా టీమ్​లో ప్రతి ఒక్కరికి రెండు డోస్​ల వ్యాక్సిన్​ పూర్తి చేస్తామని చెప్పింది. టోక్యో 
బయలుదేరడానికి ముందే ఈ వ్యవహారాన్ని కంప్లీట్​ చేయనున్నారు. ‘గేమ్స్​లో పాల్గొనే ప్రతి ఒక్కరి సేఫ్టీ మాకు చాలా ముఖ్యం. ఇందుకు సంబంధించిన అన్ని ప్రొటోకాల్స్​ను మేం పాటిస్తాం. ఐవోసీ ఇచ్చిన గైడ్​లైన్స్​ను పాటిస్తాం. అథ్లెట్స్​, టెక్నికల్​ అఫీషియల్స్​, డెలిగేట్​ మెంబర్స్​కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. జపాన్​ బయలుదేరడానికి ముందే వీళ్లకు వ్యాక్సినేషన్​ కంప్లీట్​ చేస్తాం. వీళ్లలో చాలా మందికి ఫస్ట్​ డోస్​ కంప్లీట్​ అయ్యింది. 
ప్రొటోకాల్స్​ ప్రకారం సెకండ్​ డోస్​ను కూడా అందిస్తాం’ అని ఐవోఏ పేర్కొంది.