లాక్ డౌన్ ఎఫెక్ట్: భార్యా భర్తల మధ్య తగాదా పెట్టిన గేమ్

లాక్ డౌన్ ఎఫెక్ట్: భార్యా భర్తల మధ్య తగాదా పెట్టిన గేమ్

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంట్లోనే ఖాళీగా ఉన్న త‌న భ‌ర్త‌ను త‌న‌తో పాటు ఆన్ లైన్ గేమ్ ఆడాల‌ని కోరింది ఓ మ‌హిళ‌. బ‌య‌ట క‌ర్ఫ్యూ ఉన్నందున ఇంట్లోనే ఉండాల‌ని కోర‌డంతో.. అత‌ను కూడా అందుకు ఒప్పుకున్నాడు. భార్య‌తో క‌ల‌సి ఆన్‌లైన్‌లో లూడో గేమ్‌ ఆడాడు. అయితే ప్రతిసారి ఆ గేమ్ లో భా‌ర్య చేతిలో ఓడిపోవ‌డంతో కోపోద్రిక్తుడై .. ఆమెతో గొడవదిగి దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె వెన్నెముక విరిగిపోయింది.గుజరాత్‌లోని వడోదరలో ఈ ఘటన జ‌రిగింది.

ట్యూషన్‌ టీచర్‌గా పని చేస్తున్న ఓ మహిళ త‌న భ‌ర్త‌ను లూడో ఆట ఆడాలంటూ కోరింది. ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్న అత‌ను ప్ర‌స్తుతం లాక్ డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉండ‌డంతో అందుకే స‌రేన‌న్నాడు. అయితే ఆ గేమ్ గురించి అంత‌గా తెలియ‌ని ఆ భ‌ర్త ప్ర‌తీసారి భార్య చేతిలో అతడు ఓడిపోతూ వచ్చాడు. మూడు నాలుగు సార్లు ఆమె ఓడించ‌డంతో అవమానం తట్టుకోలేక ఆమెతో గొడవకు దిగాడు. గొడ‌వ‌లో మాటా మాట పెరగడంతో ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె వెన్నెముక విరిగిపోవడంతో వైద్యులు చికిత్స అందించారు. వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఇద్ద‌రికీ కౌన్సిలింగ్ ఇచ్చి కాపురం చక్కదిద్దారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయి త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్ద ఉంటున్న ఆ మ‌హిళ భ‌ర్త‌పై పెట్టిన కేసు వాప‌స్ తీసుకొని తిరిగి అత‌ని వ‌ద్ద‌కే వెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంది.