
విజయ్ శంకర్ విశ్వరూపం చూపించాడు. చేజారేలా ఉందన్న మ్యాచ్ ను సునాయాసంగా గెలిపించి చూపించాడు. సిక్సర్లతో కోల్ కతా బౌలర్లపై విరుచుకుపడి గుజరాత్ టైటాన్స్ కు విక్టరీని అందించాడు. దాంతో కోల్ కతా నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలోనే చేదించింది.
గుజరాత్ ఓపెనర్లు సాహా (10, 10 బంతుల్లో), శుభ్ మన్ గిల్ (49, 35 బంతుల్లో) మంచి స్టార్ట్ అందించారు. పవర్ ప్లేలోనే సాహా త్వరగా ఔట్ అయ్యేసరికి మొదటి వికెట్లో వచ్చిన హార్దిక్ పాండ్యా (26, 20 బంతుల్లో) కాస్త నెమ్మదిగా ఆడాడు.
అయితే, ఓ దశలో ఓటమికి చేరువ అవుతుందేమో అనుకున్న గుజరాత్ టైటాన్స్ ను విజయ్ శంకర్ (51, 24 బంతుల్లో), డేవిడ్ మిల్లర్ (32, 18 బంతుల్లో) విజయ తీరాలకు చేర్చారు. కోల్ కతా బౌలర్లలో హర్షిత్ రానా, రస్సెల్, సునిల్ నరైన్ కు చెరో వికెట్ దక్కింది.