కాంగ్రెస్ గుంత కాడి నక్కలా వ్యవహరిస్తోంది: కర్నే ప్రభాకర్

కాంగ్రెస్ గుంత కాడి నక్కలా వ్యవహరిస్తోంది: కర్నే ప్రభాకర్

కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో గ‌త ఉద్యమంలోనూ ..ఇప్పుడూ త‌మది ఒకే వైఖరి అని అన్నారు ప్రభుత్వ విప్ కర్నే ప్రభాకర్. పోతి రెడ్డి పాడు ను తాము ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నామ‌ని అన్నారు. 44 వేల క్యూసెక్కుల నీటి తరలింపుపై కృష్ణా బోర్డుకు తాము ఈ ఏడాది జనవరి 29 నాడే లేఖ రాశామని, . బోర్డు కూడా ఈ ప్రయత్నం ఆపాలని ఆంధ్ర ప్రదేశ్ లేఖ రాసింద‌ని అన్నారు. కానీ ఏపీ నుంచి ఆ లేఖ‌కు స‌మాధానం రాలేద‌ని చెప్పారు. మే 5 న ఏపీ ప్రభుత్వం జీవో తీస్తే 11 న సీఎం కేసీఆర్ సమీక్ష చేసి వ్యతిరేకించార‌న్నారు.

ఏపి నీటి తరలింపు ను తాము అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే.. కాంగ్రెస్ గుంత కాడి నక్కలా వ్యవహరిస్తోందన్నారు క‌ర్నే ప్ర‌భాక‌ర్. గతంలో 44 వేల క్యూసెక్కుల ను తరలింపు సమయం లో రఘువీరా రెడ్డి పాదయాత్ర చేస్తే హారతులు పట్టింది కాంగ్రెస్ మంత్రులు కాదా..అని ప్ర‌శ్నించారు. తెలంగాణ కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అన్యాయం చేసే పార్టీ గానే మిగులుతుందని, కాంగ్రెస్ గతం లో చేసిన పాపం కడుక్కునెందుకు ఇప్పుడైనా మాతో కలిసి న్యాయపోరాటానికి సహకరించాలని ఆయ‌న అన్నారు

బీజేపీకి జాతీయ విధానమే వుంటే.. 2014 విభజన చట్టం ప్రకారం ఎవరు తప్పు చేసినా కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు విప్. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఆత్రం ఎక్కువని, అవగాహన లేదని ఆయ‌న అన్నారు. కృష్ణా నీటి తరలింపు ను ఏపి బిజెపి నేతలు స్వాగతిస్తుంటే… తెలంగాణ బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. ఎవరు మాట్లాడేది క‌రెక్టో తేల్చుకోవాలని చెప్పారు.