
హైదరాబాద్,వెలుగు: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ తనిఖీల్లో మొత్తంగా రూ.63.41 కోట్ల నగదు, 34 కిలోలకు పైగా బంగారం సహా మద్యం, గంజాయి, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులను పట్టుకున్నట్టు పోలీస్‌శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మొత్తంగా 477 చెక్‌పోస్టులు, రాష్ట్ర సరిహద్దుల్లో 89 అంతరాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా 464 స్ట్రాటజిక్ సర్వైలైన్స్ టీంలను ఏర్పాటు చేసి నగదు, మద్యం, మత్తుపదార్థాల అక్రమ రవాణాపై దృష్టిపెట్టినట్టు వారు పేర్కొన్నారు.