భార్య చేసే వంటలకు వంక పెట్టకండి : ఎందుకంటే ఇంట్లో భార్యచేసే బిర్యానీయే ఇంటికి ఆధారం (వీడియో)

భార్య చేసే వంటలకు వంక పెట్టకండి : ఎందుకంటే ఇంట్లో భార్యచేసే బిర్యానీయే ఇంటికి ఆధారం (వీడియో)

భార్య చేసిన బిర్యానీయే ఆ కుటుంబానికి వరంగా మారింది. అందుకే భర్తలు ఎప్పుడైనా భార్యలు చేసే వంటలకు వంకలు పెట్టే సాహసం చేయకండి. ఎందుకంటే రేపొద్దున భార్య చేసిన వంటలే కుటుంబానికి అండగా నిలుస్తాయని అంటున్నారు నెటిజన్లు.

కరోనా కారణంగా ఆర్ధిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దినసరి కూలినుంచి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్ధిక ఇబ్బందులు శాపంగా మారుతున్నాయి. పనిచేసేందుకు పనిదొరక్క, ఉన్న ఉద్యోగం పోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారుతోంది.

ఢిల్లీలో కాస్మోటిక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రోహిత్  కరోనా వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆదాయం లేదు. జీతం కాదు కదా చేసేందుకు పనిలేదంటూ కాస్మోటిక్ కంపెనీ రోహిత్ ను విధుల నుంచి తొలగించింది. ఉద్యోగం పోవడంతో మరో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. రోహిత్ భార్య రజిని బిర్యానీ బాగా చేస్తుంది.

రోజులు గడిచే కొద్దీ ఆర్ధిక సమస్యలు ఎక్కువ అవుతాయని భావించిన రజిని ఓ నిర్ణయానికి వచ్చింది. ఇంట్లో చేసే బిర్యానితో బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. అంతే ఏ మాత్రం ఆలస్యం చేయని రజిని తన భర్త రోహిత్ తో కలిసి బిర్యాని బిజినెస్ ను ప్రారంభించింది.

ఉదయం నాలుగున్నర నుంచి బిర్యాని చేయడం ప్రారంభించి..తొమ్మిది, పదిగంటల ప్రాంతంలో రద్దీగా ఉండే ఏరియాలో బిర్యానీ అమ్మకాలు ప్రారంభించింది. ఇప్పుడా బిర్యానీ వ్యాపారం జోరందుకున్నట్లు దంపతులు చెబుతున్నారు. నామమాత్రపు ధర, రుచికరమైన బిర్యాని టేస్ట్ బాగుందంటూ బిర్యానీ ప్రియులు లొట్టలేసుకొని మరీ తింటున్నారు. రజిని బిర్యానీ ఐడియాపై నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు.  అందుకే భార్య చేసే వంటలకు వంకపెట్టొద్దని చలోక్తులు విసురుతున్నారు.

After the lockdown stripped him off a job, it was his wife’s biryani that came to their rescue. Meet the incredible Sardanas of New Delhi.

Brut India यांनी वर पोस्ट केले रविवार, ४ ऑक्टोबर, २०२०