వోడాఫోన్ ఐడియాకు రూ.5 వేల కోట్ల నష్టం

వోడాఫోన్ ఐడియాకు రూ.5 వేల కోట్ల నష్టం

Vodafone Idea losses Rs.5000 crముంబై: రిలయన్స్‌‌‌‌ జియో సెగ, పన్ను భారం వోడాఫోన్‌‌‌‌ ఐడియా లిమిటెడ్‌కు గట్టిగానే తగిలింది. డిసెంబర్‌‌‌‌ 2018 తో ముగిసిన మూడో క్వార్టర్‌‌‌‌కు రూ. 5,005 కోట్ల భారీ నష్టాన్ని వోడాఫోన్‌‌‌‌ ఐడియా ప్రకటించింది.
సెప్టెంబర్‌‌‌‌తో ముగిసిన రెండో క్వార్టర్‌‌‌‌లోనూ కంపెనీ రూ.4,974 కోట్ల నష్టాన్నే ప్రకటించింది. విలీనానికి సంబంధించిన పన్నుల బరువు అధికమై రూ.2,000 వేల కోట్లు చేరినట్లు వోడాఫోన్‌‌‌‌ ఐడియా తెలిపింది. ఈ భారం జులై-సెప్టెంబర్‌‌‌‌ 2018 క్వార్టర్‌‌‌‌లో రూ.45 కోట్లు మాత్రమే. బుధవారం సమావేశమైన డైరెక్టర్ల బోర్డు ఆర్థిక ఫలితాలతోపాటు, రూ.25 వేల కోట్ల రైట్స్‌‌‌‌ ఇష్యూకు ఆమోదం తెలిపింది.
రూ.1 పెరిగిన ఏఆర్‌‌‌‌పీయూ
రెండో క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే మూడో క్వార్టర్‌‌‌‌లో ఏవరేజ్‌ రెవెన్యూ పెర్‌‌‌‌ యూనిట్‌‌‌‌ (ఏఆర్‌‌‌‌పీ యూ) రూ.1 పెరిగి రూ.89 కి చేరిందని కంపెనీ వెల్లడించింది. డిసెంబర్‌‌‌‌ 2018 చివరి నాటికి మొత్తం రుణ భారం ఏకంగా రూ.1,23,660 కోట్లకు చేరినట్లు చెబుతూ, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి స్పెక్ట్రమ్‌‌‌‌ కోసం చెల్లిం చాల్సిన రూ. 91,480 కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని తెలిపింది. నగదు నిల్వలు రూ.8,900 కోట్లని, ఇవి మినహాయిస్తే నికరంగా అప్పులు రూ.1,14,760 కోట్లని వోడాఫోన్‌‌‌‌ ఐడియా వివరించింది.