సందడిగా ఓయూ వ్యవస్థాపక దినోత్సవం

 సందడిగా ఓయూ వ్యవస్థాపక దినోత్సవం

ఓయూ, వెలుగు: ఓయూ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా సోమవారం క్యాంపస్​లో నిర్వహించిన కార్యక్రమాలు సందడిగా సాగాయి. ఆర్ట్స్​కాలేజీ నుంచి ఎన్​సీసీ గేట్​వరకు ఉదయం 2కే వాక్​నిర్వహించారు. ఓయూ టెక్నాలజీ కాలేజీ ఆధ్వర్యంలో ‘టెక్నో ఉస్మానియా’ పేరుతో 3 కే రన్, ఫ్లాష్​మాబ్ నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో స్టూడెంట్లు, లెక్చరర్లు పాల్గొని సందడి చేశారు. 2కే వాక్‌ను ఓయూ వీసీ ప్రొఫెసర్​రవీందర్​యాదవ్​ఆర్ట్స్​కాలేజీ వద్ద జెండా ఊపి ప్రారంభించగా, గ్రీన్ లివింగ్ఈజ్ స్మార్ట్ లివింగ్ అనే నినాదంతో ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ పూర్వ విద్యార్థి సంఘం కోశాధికారి, రిటైర్డ్ సైంటిస్ట్  సీపీ రాములు 3కే రన్​ను ప్రారంభించారు. ఓయూ లేడీస్ హాస్టల్​సమీపంలోని ఎల్లమ్మ టెంపుల్​వద్ద ఫ్లాష్​మాబ్ తో అదరగొట్టారు. డీజే సాంగ్స్‌కు అనుగుణంగా డ్యాన్సులు చేశారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్​లక్ష్మీనారాయణ, డీన్​ప్రొఫెసర్​మల్లేశం, టెక్నాలజీ కాలేజీ ప్రిన్సిపాల్​ప్రొఫెసర్​చింతా సాయిలు, లెక్చరర్లు రమేశ్, బసవరావు, హయ వదన, శ్రీను నాయక్, పరశురామ్​తదితరులు పాల్గొన్నారు.