ప్రధానిగా ఎవరున్నా దేశం మూడో ప్లేసుకు పోతది : చిదంబరం

ప్రధానిగా ఎవరున్నా దేశం మూడో ప్లేసుకు పోతది :  చిదంబరం

కోల్​కతా: ప్రధానిగా ఎవరున్నా మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. జీడీపీ వృద్ధికి, ప్రధానిగా ఎవరున్నారనే దానికి ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొన్నారు. మళ్లీ మోదీని గెలిపిస్తేనే మన దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్న బీజేపీ ప్రచారంపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు. ‘‘2004లో మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. 2014 నాటికి 7వ స్థానానికి ఎగబాకింది. భవిష్యత్తులో మూడో స్థానానికి చేరడం కూడా ఖాయం. దీనికి ప్రధానిగా ఎవరున్నారనే దానికి సంబంధమే లేదు. ఆ పదవిలో ఎవరున్నా మన దేశం మూడో స్థానానికి చేరుకుంటుంది. అందులో ఎలాంటి మ్యాజిక్ లేదు. అది దేశ జీడీపీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రధాని మీద కాదు” అని చిదంబరం స్పష్టం చేశారు.