కరువు సాయం కోసం సీఎం సిద్ధూ ధర్నా

కరువు సాయం కోసం సీఎం సిద్ధూ ధర్నా

బెంగళూరు: కరువు నిధుల విడుదల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ కర్నాటక సీఎం సిద్ధరామయ్య ధర్నా చేశారు. ఆదివారం బెంగళూరులోని విధాన సౌధ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాం ఎదుట ఆయన ధర్నా నిర్వహించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాలో పాల్గొన్నారు. ఖాళీ చెంబును పట్టుకొని, కరువును ఎదుర్కొనేందుకు నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం కర్నాటకను మోసం చేసిందని పార్టీ నేతలు ఆరోపించారు. 

రాష్ట్రంలోని మొత్తం 236 తాలూకాల్లో 226 తాలూకాలు కరువు బారిన పడ్డాయని, 48 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని సర్కార్‌‌ వెల్లడించింది. దీంతో మొత్తం రూ.18,171 కోట్లు కరువు నిధుల కింద విడుదల చేయాలని కేంద్రాన్ని సిద్ధరామయ్య డిమాండ్‌ చేశారు. అయితే, ఈ విషయంలో రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కేంద్ర ప్రభుత్వం రూ.3,454 కోట్లు మాత్రమే రిలీజ్‌ చేసిందని, ఈ నిధులు ఏ మాత్రం సరిపోవని మండిపడ్డారు.