
- ఎన్నికల ప్రచారంలో ఎంపీ కె.లక్ష్మణ్
ముషీరాబాద్, వెలుగు: దేశ జనాభాలో సగమైన బీసీల కుల వృత్తులను అభివృద్ధి చేసింది, అన్ని రంగాలను ప్రోత్సహించింది బీజేపీనేనని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చెప్పారు. ఆదివారం ముషీరాబాద్‌లోని రామ్ నగర్, బాగ్ లింగంపల్లి, పాలమూరు బస్తీలో ఆయన పాదయాత్ర చేపట్టి, డోర్‌టు డోర్ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్‌మాట్లాడుతూ.. దేశంలోనే అత్యున్నతమైన పదవిని బీజేపీ బీసీలకు కేటాయించిందని చెప్పారు. ప్రధానిగా నరేంద్ర మోదీని మూడోసారి ఆశీర్వదించేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సికింద్రాబాద్బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కిషన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
లక్ష్మణ్ వెంట కార్పొరేటర్ రవిచారి, కన్వీనర్ రమేశ్‌రామ్, నాయకులు పూసరాజు, పార్థసారధి, మద్దూరి శివాజీ, శక్తి సింగ్, జైపాల్ రెడ్డి, కాలకోట అరుణ్ కుమార్, రమాదేవి, జ్యోతి తదితరులు ఉన్నారు.