- కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్ టౌన్,వెలుగు: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేసి, కరీంనగర్‌ను డ్రగ్స్‌రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ చిత్ర మిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో సీపీ గౌస్ ఆలంతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు.
పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలోని యాంటీ డ్రగ్ కమిటీలు చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఈనెల 15 నుంచి చార్జ్ ఆఫీసర్లు, అడిషనల్ చార్జి ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ అడిషనల్ సెన్సెస్ ఆఫీసర్లకు నిర్వహిస్తున్న అవగాహన తరగతులను పరిశీలించారు.
